అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘హలో’ డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల అవ్వబోతుంది. గతంలో అక్కినేని ఫామిలీకి మనం వంటి క్లాసిక్ సినిమాను ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం సినిమాకోసం అక్కినేని కుటుంబం అంత కదిలి వచ్చింది.
ఇప్పుడు హలో కోసం కూడా అంతే అని సమాచారం. ఇందులో నాగార్జున, అమల, సమంత అతిథి పాత్రల్లో కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి విశేష స్పందన లభించింది. దానితో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి కూడా. తన మొదటి సినిమా భారీ ప్లాప్ కావడంతో అఖిల్ ఈ సినిమాపై చాల ఆశలు పెట్టుకున్నారు.
కొత్త అమ్మాయి కల్యాణి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. గతంలో మనం సినిమాని కూడా ఆయన నిర్మించారు. ఈ సినిమా తర్వాత అఖిల్ కొరటాల శివ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.



