కనీసం.. 2 వీక్స్ ప్లీజ్ – వేడుకున్న కింగ్ నాగ్!

Nagarjuna speaks about film post-production

ఇండస్ట్రీకి సంబంధించిన రియల్ ఇష్యూని హైలైట్ చేశారు నాగార్జున. మనం దాదాపు అన్ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ లేదా ప్రెస్ మీట్స్ లో చూస్తూనే, వింటూనే ఉంటాం.. రెండు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని, ఇంకా మా డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు, అందుకే ఈవెంట్/ప్రెస్ మీట్ కి రాలేకపోయాడు అని చాలా రొటీన్ గా చెబుతూ ఉంటారు.

నెలలు లేదా ఏళ్ల తరబడి మేకింగ్ లో ఉన్న సినిమాకి, ఆఖరి రెండుమూడు రోజుల్లో, కుదిరితే రిలీజ్ నైట్ కూడా మెరుగులు దిద్దుతూనే ఉంటారు డైరెక్టర్ & పోస్ట్ ప్రొడక్షన్ టీమ్. అందుకు కారణం డైరెక్టర్ & ఎడిటర్ ఫైనల్ అవుట్ పుట్ ని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కి సరైన టైమ్ కి ఇవ్వకపోవడమే.

ADVERTISEMENT

రీసెంట్ గా రిలీజైన “సింగ్ గీతం” విషయంలో కూడా ఇదే జరిగింది. ఓవర్సీస్ ప్రింట్స్ కి కనీసం గ్రాఫిక్స్ కూడా పూర్తవ్వని ప్రొడక్ట్ ఇచ్చారు. తర్వాత మళ్లీ కొత్త ప్రింట్స్ తో అప్డేట్ చేసారు. ఇలా జరగడానికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే.

దీన్నే ఇవాళ నాగార్జున కూడా ప్రశ్నించారు. ఒడిస్సీ లాంటి సినిమాని ఏడాది ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, ఎలాంటి వాయిదా లేకుండా విడుదల చేస్తున్నప్పుడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కనీసం రెండు వారాల ముందు ఫైనల్ ప్రొడక్ట్ ని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కి ఇవ్వగలిగితే అద్భుతమైన అవుట్ పుట్ ఇస్తారు, పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని రిక్వెస్ట్ చేశారు నాగార్జున.

అయితే.. నాగార్జున ఇక్కడ ఎవర్నీ బ్లేమ్ చేయలేదు, టార్గెట్ చేయలేదు. ప్రేక్షకులు, విమర్శకులు గత కొన్నేళ్లుగా మొత్తుకుంటున్న ఒక ఇష్యూకి వాయిస్ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఇండస్ట్రీ కాస్త ఆలోచించి ఈ విషయమై ఏదైనా సొల్యూషన్ తీసుకొస్తారా లేక ఎప్పట్లానే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories