చైతూ – సమంత ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ – నాగ్!

Nagarjuna on Naga Chaitanya Samantha weddingడిసెంబర్ లో అఖిల్ నిశ్చితార్ధం, జనవరిలో నాగచైతన్య ఎంగేజ్మెంట్లు చేసి తండ్రిగా తన బాధ్యతలను కాస్త దింపుకున్న ‘కింగ్’ నాగార్జున, ఆ శుభముహుర్తాన పెళ్లి కాస్త కానిచ్చేస్తే తన భారం దిగిపోతుందంటున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనేది వాళ్ళ నిర్ణయమేనని, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తానూ మాత్రం సిద్ధమనేని నాగ్ తెలిపారు. జనవరిలో నిశ్చితార్థం చేసుకుంటానన్నాడు, వాడి ఇష్ట ప్రకారమే చేశాము, పెళ్లి విషయంలోనూ అంతే!

నాగ చైతన్య – సమంతలు ఎక్కడ, ఎప్పుడు వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని అన్నారు. ‘కింగ్’ నటించిన తాజా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ విడుదల ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా… ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలతో పాటు తమ ఇంట్లో పెళ్లి ముచ్చట్ల గురించి నాగార్జున చెప్పుకొచ్చారు. వేంకటేశ్వరుడి భక్తుడు అయిన హాథీరాం బావాజీ గురించి ఎక్కువగా తెలియదని, ఆయన గురించి తెలుసుకోవడానికి దేశ వ్యాప్తంగా ఉన్న మఠాలన్నీ చిత్ర బృందం తిరిగిందని చెప్పారు.

ADVERTISEMENT

ఈ చిత్రంలో తన పాత్రకు, వేంకటేశ్వరుడి పాత్రధారికి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని, విలక్షణ సినిమాలు చేస్తోన్న ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా కూడా మరోసారి ఆదరిస్తారని నమ్ముతున్నానని, చిత్రాన్ని ధియేటర్లలో మాత్రమే చూడాలని ప్రేక్షకులను ఈ సందర్భంగా కోరారు. కీరవాణి స్వరపరిచిన ఆడియో ఇప్పటికే విడుదల కాగా, ‘అన్నమయ్య’ రేంజ్ లో పాటలు లేవన్నది సంగీత సాహిత్య ప్రియుల టాక్.

ADVERTISEMENT
Latest Stories