340 కోట్ల ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో మరోసారి వార్తల్లోకొచ్చేసారు రాంగోపాల్ వర్మ. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వర్మ పేరు హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. పలువురు సెలబ్రిటీలు కూడా వర్మ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేసారు. ఆ క్రమంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా వర్మను మెచ్చుకుంటూ, మేమంతా గర్వంగా ఫీల్ అయ్యేలా చేసావంటూ ట్వీట్ చేసారు.
నాగ్ ట్వీట్ కు వర్మ తనదైన శైలిలో ప్రతిస్పందించారు. “పరిపక్వత లేని తనకు ‘శివ’ ద్వారా బ్రేక్ ఇచ్చినందుకు గానూ నేను 10 జీవితాలు మీకు రుణపడి ఉంటాను. నేను చూసిన విజన్ కంటే నీ విజన్ ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా నిరూపణ అయ్యిందని, నీ విజన్ కు ఒక దండం” అంటూ ఒక ‘నమస్కారం’తో కూడిన సింబల్ తో నాగ్ కు రిప్లై ఇచ్చారు. అంటే తన టాలెంట్ ను తన కంటే ముందు నాగ్ గుర్తించారని వర్మ వివరణ ఇచ్చారన్నమాట!



