అబ్బా ఇది కదా పర్ఫెక్ట్ బర్త్ డే సెలబ్రేషన్ అంటే!

Nandamuri Balakrishna is celebrating his 61st birthday today.నందమూరి బాలకృష్ణ ఈరోజు తన 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు చాలా కోలాహలంగా ఉన్నాం. సోషల్ మీడియా అంతా వారి సందడితో నిండిపోయి ఉంది. బర్త్ డే సందర్భంగా అఖండ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటి వరకు విడుదల చేసినవి అన్నీ మాస్ గా ఉంటే ఈ పోస్టర్ క్లాస్ గా అదరగొట్టింది.

ఈరోజు ఉదయమే బాలకృష్ణ తదుపరి చిత్రం #NBK107 అధికారికంగా ప్రకటించారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్మించనున్నారు.

ADVERTISEMENT

డైరెక్టర్ నుండి నిర్మాతల వరకు ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాకు అన్నీ సరిపోయిన ప్రాజెక్ట్ అంటే ఇదే. 2018లో విడుదలైన జైసింహా తరువాత బాలకృష్ణ కు హిట్ అనేది లేదు. జైసింహా కూడా కమర్షియల్ గా వర్క్ అవుటైనా ఫ్యాన్స్ కు అంతా నచ్చిన సినిమా కాదు. ఇటువంటి తరుణంలో అఖండ, #NBK107 వంటి ప్రామిసింగ్ ప్రాజెక్టులు బ్యాక్ టు బ్యాక్ పడటంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.

పైగా పుట్టినరోజు పొద్దునే తారక్ బాబాయ్ కి విష్ చేసి మరింత జోష్ నింపాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘బాబాయ్’ అనే పదం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అబ్బా ఇది కదా పర్ఫెక్ట్ బర్త్ డే సెలబ్రేషన్ అంటే! అనే విధంగా బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి.

ADVERTISEMENT
Latest Stories