బాలయ్య నెంబర్ 1… టాప్ 5లో మూడు మనవే..!

nandamuri-balakrishna-yudh-ek-jung-dictatorదక్షిణాది ప్రతి అగ్ర సినిమా కూడా హిందీలో డబ్బింగ్ రూపంలో బుల్లితెరపై ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ రూరల్ ప్రాంతాల బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ బాగా ఉండడంతో తెలుగు, తమిళ మాస్ సినిమాలను డబ్బింగ్ చేసి ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం ప్రదర్శితమైన అన్ని సినిమాలలోకల్లా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “డిక్టేటర్” డబ్బింగ్ బొమ్మ “యుద్ ఏక్ జంగ్” సినిమా అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ ను అందుకుని నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

రూరల్ ప్రాంతాలలో లెక్కించిన ఈ రేటింగ్స్ లో 1649 పాయింట్లతో బాలకృష్ణ సినిమా తొలిస్థానంలో నిలువగా, హృతిక్ రోషన్ లేటెస్ట్ మూవీ ‘మొహెంజోదారో’ సినిమా 1511 పాయింట్లతో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే మూడవ స్థానంలో తమిళ డబ్బింగ్ బొమ్మ సూర్య నటించిన ‘సింగం 2,’ నాలుగులో గోపీచంద్ ‘జిల్,’ అయిదులో అమితాబ్ ‘సూర్యవంశం’ సినిమాలు నిలిచాయి. టాప్ 5లో మూడు సినిమాలు దక్షిణాది పరిశ్రమే కాగా, అందులో రెండు తెలుగు సినిమాలే కావడం మరో విశేషం. దీంతో రూరల్ ప్రాంతాల్లో దక్షిణాది మాస్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోందని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories