ఇజం’ సెన్సార్ షాక్ ఇచ్చినట్లేగా..!

Nandamuri Kalyan Ram -ISM Censor Reportఒక దర్శకుడిగా పూరీ జగన్నాధ్ ఎంత విజయవంతం అయ్యారో… అంతకు మించి ఒక రచయితగా, డైలాగ్స్ రైటర్ గా పూరీ సక్సెస్ రేంజ్ ఉంది. డైరెక్టర్ గా ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి గానీ, ఒక డైలాగ్ రైటర్ గా పూరీ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అలాంటి పూరీ తాజాగా రచించి దర్శకత్వం వహించిన “ఇజం” సినిమా సెన్సార్ ఫార్మాలిటిస్ ను పూర్తి చేసుకుని, ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను తెచ్చుకుంది.

ADVERTISEMENT

పూరీ సినిమాలకు ‘యు/ఎ’ సర్టిఫికేట్ రావడం సహజమే. అయితే ‘ఇజం’ సినిమా ఫస్ట్ టీజర్ లో వినిపించిన డైలాగ్స్ (డక్) రీత్యా… ఈ సినిమాలో మసాలా డైలాగ్స్ కు, పూరీ బూతు పంచ్ లకు కొదవ ఉండదని భావించారు. దీంతో ‘ఇజం’ అడల్ట్ ‘ఎ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని భావించారు. కానీ, అంతా అవాక్కయ్యే రీతిలో ‘యు/ఎ’ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

సెన్సార్ ఇచ్చిన షాక్ తో బహుశా ‘ఇజం’ను పూరీ చాలా పద్దతిగా తీర్చిదిద్దారేమో అన్న టాక్ హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో పూరీ జగన్నాధ్ తీసిన ‘టెంపర్’ కూడా ‘యు/ఎ’నే సొంతం చేసుకుని, బుడ్డోడు కెరీర్ లో ఒక టర్నింగ్ సినిమాగా నిలవడంతో… కళ్యాణ్ రామ్ కు కూడా అదే తరహా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి, కళ్యాణ్ కెరీర్ ను ఓ మలుపు తిప్పుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సమాధానం లభించాలంటే… అక్టోబర్ 21వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories