నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న “ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయ్)” సినిమా ఫస్ట్ టీజర్ ను సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మణిశర్మ అందించిన పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో ‘ఎమ్మెల్యే’ గారి ఇంట్రడక్షన్ ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఈ ‘ఎమ్మెల్యే’ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిందని ఈ చిన్న పరిచయంతో చెప్పకనే చెప్పారు. పృధ్వీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్, కళ్యాణ్ రామ్ లుక్ తో ‘ఎమ్మెల్యే’ టీజర్ ఓకే అనిపిస్తుంది.
‘మైక్రో టీజర్’ అని చిత్ర యూనిట్ ముందుగానే చెప్పడంతో…. కళ్యాణ్ రామ్ మినహా ఈ టీజర్ లో ఎవరూ కనిపించలేదు. ముఖ్యంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేకపోవడం కాస్త నిరాశ చెందే విషయం. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలాకాలం తర్వాత మణిశర్మ ఓ చెప్పుకోదగ్గ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో, ఈ “ఎమ్మెల్యే”పై అంచనాలు బాగానే ఉన్నాయి.





