మహేష్ చెప్పాడుగా… హిట్ ఖాతాలో వేసుకోవచ్చా..!

nandini-nursing-home-super-hit-mahesh-babu-wishesసూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి నరేష్ తనయుడు నవీన్, ఎ శుక్రవారం నాడు ‘నందిని నర్సింగ్ హోం’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రిన్స్ మహేష్ బాబు అండదండలు లభించడంతో, చిన్న చిత్రమైనా ప్రచారానికి ఎక్కడా లోటు ఏర్పడలేదు. అలాగే ‘మౌత్ టాక్’ విషయంలో కూడా మిగిలిన సినిమాల కంటే ముందు ఉండడంతో, ఓపెనింగ్స్ కూడా సంతృప్తిగానే ఉండడం విశేషం.

ఇక, తాజాగా ఈ సినిమాపై మరోసారి ట్వీట్ చేసాడు ప్రిన్స్ మహేష్ బాబు. “డెబ్యూ హీరోగా నవీన్ చాలా కమండబుల్ అభినయాన్ని ప్రదర్శించాడని, ‘నందిని నర్సింగ్ హోం’ సక్సెస్ ను మించిన సంతోషం మరొకటి లేదని, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందలు” తెలిపాడు ప్రిన్స్. చాలా అరుదుగా మాత్రమే చేసే ప్రిన్స్ ట్వీట్స్ కు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో ఒక విలువ ఉంటుంది.

ADVERTISEMENT

ఖచ్చితమైన సమాచారం అయితేనే ట్వీట్ చేసే ప్రిన్స్ వ్యాఖ్యలతో ‘నందిని నర్సింగ్ హోం’ను ఈ ఏడాది హిట్ సినిమాల జాబితాలో వేయవచ్చా? లేక ఈ సినిమాకు అయిన బడ్జెట్ – కలెక్షన్స్ వివరాల కోసం వేచిచూడాలా? లో బడ్జెట్ మూవీ కావడంతో తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా బడ్జెట్ మొత్తం రావచ్చన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. దీనికి తోడు మౌత్ టాక్ ప్లస్ పాయింట్ కావడంతో, ప్రిన్స్ చెప్పినట్లు ‘నందిని నర్సింగ్ హోం’ను హిట్ ఖాతాలో వేయవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories