విడిపోనున్న మరో సినీ సెలబ్రిటీ!

nandita-das-subodh-divorceబాలీవుడ్ కు 2016వ సంవత్సరం విడాకుల నామ సంవత్సరంగా మిగిలిపోయింది. కనీసం 2017లో అయినా సినీ సెలబ్రిటీ జంటలు కలసి మెలసి ఉంటాయా అంటే, కొత్త సంవత్సర వేడుకలు కూడా ముగియక ముందే మరో షాకింగ్ న్యూస్ వెలువడింది. ప్రముఖ నటి, దర్శకురాలు 47 ఏళ్ళ నందితాదాస్ తన ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు, తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోతున్నానని వెల్లడించింది.

ADVERTISEMENT

పిల్లలున్నప్పుడు విడిపోవడం కష్టంగానే ఉంటుందని… కానీ, మా కుమారుడికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. ఇలాంటి సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరింది. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్, 2007లో అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఏడేళ్ల క్రితం నటుడు శుభోద్ మస్కారాను పెళ్లాడింది. వీరిద్దరికీ విహాన్ అనే కుమారుడు ఉన్నాడు.

ADVERTISEMENT
Latest Stories