నాని “బాబు…” ఇక నీకు తిరుగులేనట్టే..!

Nani-Mca-Box-Office-Collectionsటాక్ తో నిమిత్తం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టగలిగే హీరోలనే సినీ ఇండస్ట్రీలో ‘స్టార్స్’గా పిలుస్తుంటారు. తాజా “ఎంసీఏ” సినిమాతో ఈ ‘స్టార్ క్యాటగిరి’లోని నాచురల్ స్టార్ నాని కూడా చేరిపోయినట్లే భావించవచ్చు. అవును… ఓ పక్కన పాజిటివ్ టాక్ లేకపోయినా… మరో పక్కన విశ్లేషకుల నుండి నెగటివ్ మార్కులు అందుకున్నా… బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపించడంలో నాని నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు.

తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకున్న నాని, రెండవ రోజు నాడు దూకుడు తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ పుంజుకుని కెరీర్ లోనే ఉత్తమమైన కమర్షియల్ హిట్ దిశగా దూసుకుపోతున్నాడు. ఈ కలెక్షన్ల ఒరవడితో నాని కెరీర్ లో మరో హిట్ వచ్చి చేరిపోయినట్లే. దీంతో ఈ ఏడాది ‘నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ’ల ద్వారా ‘హ్యాట్రిక్’ హిట్స్ అందుకున్న హీరోగా నాని, ‘హీరో ఆఫ్ ది ఇయర్’ అవార్డును దక్కించేసుకున్నాడు.

ADVERTISEMENT

అంతేకాదు… వచ్చే సమ్మర్లో విడుదల కాబోతున్న సినిమాతో ‘ట్రిపుల్ హ్యాట్రిక్’ను కూడా పూర్తి చేయడానికి అవకాశం లభించినట్లయ్యింది. నిజానికి ‘ఎంసీఏ’ సినిమాకు లభించిన టాక్ మరియు రివ్యూలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్స్ వసూలు చేస్తాయోనన్న అనుమానం సర్వత్రా నెలకొంది. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ… కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకుని దూసుకుపోతున్నాడు.

నిజానికి గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా ‘స్టార్ హీరోలకు’ చుక్కలు కనపడుతున్నాయి. నెగటివ్ టాక్ గానీ, నెగటివ్ రివ్యూ గానీ వచ్చిందంటే, అది స్టార్ హీరోల సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కానీ వాటన్నింటిని చేధించుకుని నిలబడుతున్నాడంటే… నానిని ద్వేషించే అభిమానులు కంటే ప్రేమించే వారే ఎక్కువని ఈ సందర్భంగా బయటపడుతోంది. లేదంటే ‘ఎంసీఏ’ లాంటి రొటీన్ సినిమాలకు ఈ పాటి కలెక్షన్స్ ఊహించదగినవి కావు. దీంతో ‘బాబు’ అని పిలిపించుకునే స్టేటస్ కు నాని దగ్గరైనట్లే కదా!

ADVERTISEMENT
Latest Stories