“ఎంసీఏ” టాక్… నాని ‘స్టార్ పవర్’ ఏమయ్యేను..?

Nani Middle Class Abbayi MCA Talkఇప్పటికే ‘డబుల్ హ్యాట్రిక్’ సక్సెస్ లు పూర్తి చేసుకుని… సెకండ్ లీగ్ లో నెంబర్ 1 పొజిషన్ ను కైవసం చేసుకున్న ‘నాచురల్ స్టార్’ నాని స్టార్ పవర్’కు తాజాగా విడుదలైన “ఎంసీఏ” సినిమా కఠిన పరీక్ష పెట్టబోతోంది. అవును… దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన “ఎంసీఏ” సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నాని కెరీర్ లో ‘ఫస్ట్ డే’ కలెక్షన్స్ విషయంలో రికార్డు సృష్టించే సినిమాగా కనపడుతున్న “ఎంసీఏ”కు రావాల్సినంత టాక్ మాత్రం రాకపోవడం గమనించదగ్గ అంశం.

ADVERTISEMENT

ఈ ఏడాది జనవరిలో ‘నేను లోకల్’ ద్వారా నాని – దిల్ రాజులు కలిసి మాంచి కమర్షియల్ హిట్ కొట్టగా, అదే జోడి మళ్ళీ డిసెంబర్ లో “ఎంసీఏ” సినిమాతో వచ్చారు. ఇటీవల కాలంలో వినూత్నమైన సినిమాలు చేస్తున్న నాని నుండి “ఎంసీఏ” లాంటి రొటీన్ కధలను ప్రేక్షకులు ఆశించకపోవడంతో, సినిమాకు కావలసినంత పాజిటివ్ టాక్ రాలేదన్నది స్పష్టం. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం ఏమిటంటే… ‘సూపర్ పాజిటివ్’ టాక్ ఎలా అయితే లేదో, ‘భారీ నెగటివ్’ టాక్ కూడా లేకపోవడం “ఎంసీఏ”కు కలిసొచ్చే అంశం.

ఇప్పటివరకు కొట్టిన ‘డబుల్ హ్యాట్రిక్’ బొమ్మలన్నింటికి పాజిటివ్ టాక్ రావడంతో, నాని స్టామినాకు పరీక్ష లేకుండా పోయింది. కానీ “ఎంసీఏ” ద్వారా నాని కమర్షియల్ రేంజ్ ఏంటన్నది ఖచ్చితంగా తేలనుంది. అందులోనూ మరికొద్ది గంటల్లో అఖిల్ “హలో” సినిమా కూడా విడుదల కానుండడంతో… నానికి గట్టి పోటీ ఎదురుకానుంది. దీంతో కెరీర్ లో స్టార్ హీరోగా మరో మెట్టు ఎక్కాలంటే… “ఎంసీఏ” ద్వారా నాని తన కమర్షియల్ రేంజ్ ను నిరూపించుకోవాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories