పోస్టర్ టాక్ – వీడు పక్కా లోకల్ ఎహే..!

Nani Nenu Local First Look Poster Talkటాలీవుడ్ లో హిట్ లకు పర్యాయపదం ఎవరు అంటే ప్రస్తుతం ‘నాచురల్ స్టార్’ నాని పేరే వినపడుతోంది. వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న నాని తర్వాత సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. “నేను లోకల్” టైటిల్ కు తగ్గట్టే పక్కా లోకల్ గా దర్శనమిచ్చాడు నాని. ఓ పక్కన సిగరెట్ వెలిగించుకుంటూ స్టైలిష్ గా కనపడుతున్న ఈ నాచురల్ స్టార్, టైటిల్ పక్కనే నిలబడి బీరు బాటిల్ ఎత్తుకున్న తీరు మాస్ వర్గాలను అమితంగా ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT

వరుసగా లవ్ స్టోరీలు చేస్తున్న ఈ కధానాయకుడు ఈ సారి మాస్ ఎలిమెంట్స్ పై బాగానే దృష్టి పెట్టినట్లున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలిసారిగా నాని సినిమాకు టాప్ తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘యాటిట్యూడ్ ఇజ్ ఎవ్రీథింగ్’ అనే ట్యాగ్ లైన్ నాని పోస్టర్లకు నిదర్శనంగా నిలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories