దుమ్ము దులుపుతున్న “నాన్నకు ప్రేమతో” ట్రైలర్!

Nannanaku prematho trailer‘క్రియేటివ్ జీనియస్’ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” ధియేటిరికల్ ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుకుమార్ టేకింగ్, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, సెటిల్డ్ పెర్ఫార్మన్స్ హైలైట్స్ గా నిలిచిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటివరకు సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ, సినీ అభిమానుల్లో భారీ అంచనాలను ఏర్పరచడంలో ట్రైలర్ విజయవంతమయ్యింది.

ఇంతలా సక్సెస్ అయిన ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. మొదటి 24 గంటల్లో దాదాపు 6 లక్షలకు పైగా క్లిక్స్ అందుకున్న “నాన్నకు ప్రేమతో” ట్రైలర్ తాజాగా 10 లక్షల క్లిక్స్ ను దాటింది. ఇటీవల కాలంలో ఏ సినిమాకు దక్కని విధంగా “నాన్నకు ప్రేమతో” ట్రైలర్ కు ఆదరణ దక్కడం పట్ల చిత్ర యూనిట్ తో పాటు ‘బుడ్డోడు’ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.

ట్రైలర్ తో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాడిన పాట తొలిరోజు నుండే చార్ట్ బస్టర్స్ లో స్థానం సంపాదించుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న అభిమాన గణం చూపులు జనవరి 13వ తేదీ వైపుకు చూస్తున్నాయి

ADVERTISEMENT
Latest Stories