బ్రాహ్మణి ప్రచారం భళా..!

Nara Brahmani

ఈ సారి ఏపీలో జరగబోయే ఎన్నికలలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు అత్యంత కీలకంగా తీసుకున్న నియోజకవర్గాలలో నారా లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి కూడా ఒకటి. ఇప్పటికే మంగళగిరిలో తన గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుని రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

అయితే లోకేష్ స్థానాన్ని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీ శక్తి కార్యక్రమాలతో స్థానిక మహిళలతో మమేకమై అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటు వారి సమస్యలకు తనవంతు పరిష్కారాలను చూపుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా మంగళగిరి ఆటోనగర్ లో లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీని సందర్శించారు బ్రాహ్మణి.

ADVERTISEMENT

రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరు ఆలోచించి ఓటు వేయాలని, ఈసారి ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేవిగా భావించి అప్పులతో కాదు అభివృద్ధితో సంక్షేమం అందించే వారికీ అండగా నిలవాలంటూ ఆ కంపెనీ ఉద్యోగులకు తన సందేశాన్ని అందించారు. 2019 మంగళగిరి ఎన్నికల ప్రచారంలో కూడా నారా బ్రాహ్మణి పాల్గొన్నప్పటికీ అప్పుడు ప్రసంగాలలో కాస్త తడబడిన బ్రాహ్మణి ఇప్పుడు మాత్రం రెగ్యులర్ పొలిటిషన్ మాదిరి ఎవరు ఎటువంటి ప్రశ్న వేసినా, ఏ సమస్య చెప్పినా అందుకు తగ్గట్టుగా స్పందిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే మంగళగిరిలో లోకేష్ విజయం ఖరారయినప్పటికీ మెజారిటీ మీదే ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు టీడీపీ నేతలు. ఆ మెజారిటీ అంకెను మరోస్థాయికి తీసుకు వెళ్లేలా ఉంది బ్రాహ్మణి ప్రచారం. ప్రత్యర్థి వర్గం వారి పేరెత్తకుండానే సాధారణ ప్రజలకు సైతం అర్ధమయ్యే విధంగా ప్రభుత్వ తప్పిదాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం ఇలా కూడా చేయవచ్చా, ఇలా కూడా ప్రజలను ఆకట్టుకోవచ్చా..? అనేలా బ్రాహ్మణి ముందుకెళ్తున్న తీరు ప్రశంసనీయమే.

ADVERTISEMENT
Latest Stories