ఈ చిన్న పిల్లోళ్ళు ఇలా అనర్గళంగా మాట్లాడేస్తుంటే…

nara-lokesh-ram-mohan-naidu-bhogapuram-airport-inaguration

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగాఅక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ప్రసంగించారు.

రామ్మోహన్ నాయుడు హిందీలో అనర్గళంగా ప్రసంగిస్తున్నప్పుడు ప్రధాని మోడీ చిర్నవ్వుతో ఆసక్తిగా విన్నారు. తెలుగులో మాట్లాడుతున్నప్పుడు సభకు హాజరైన ప్రజలు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

తర్వాత మాట్లాడిన మంత్రి నారా లోకేష్‌ వస్తూనే, “ఎర్రబస్సు రానిచోటికి ఎయిర్ బస్ వచ్చింది. ప్రధాని మోడీ వచ్చారు. అర్దమైందా రాజా?” అంటూ పంచ్ డైలాగుతో ప్రసంగం మొదలుపెట్టేసరికి ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఎర్రబస్సు గురించి వివరించినప్పుడు అయన కూడా చిర్నవ్వు నవ్వారు.

నారా లోకేష్‌ ప్రసంగిస్తూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ పవిత్ర నేలపై ఆయన పేరిట అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించుకోవడం గర్వకారణమన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ఏవిధంగా అభివృద్ధి వేగవంతమవుతుందో వివరించారు. తద్వారా విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్రా అభివృద్ధి అవుతుందనే వైసీపీ వాదన వితండవాదనే అని చెప్పకనే చెప్పారు.

సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖులు, వేలాదిమంది ప్రజల సమక్షంలో రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్‌ ఇద్దరూ ఏమాత్రం తడబడకుండా అనర్గళంగా ప్రసంగించడం మామూలు విషయం కాదు.

కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి మొన్న శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘సీపీఆర్ అంటే ఏమిటి? హార్ట్, చెస్ట్ పంపింగ్..’ అంటూ మాట్లాడటం చూసి అందరూ నవ్వుకున్నారు.

‘చిన్న పిల్లోడు తప్పు చేస్తే… 45 ఏళ్ళ దారినపోయే దానయ్య చనిపోతే…’ అంటూ జగన్‌ మాట్లాడిన మాటలపై విమర్శలు వెల్లువెత్తాయి.

వాస్తవానికి జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజుని పరామర్శించడం కోసమే జగన్‌ అంత దూరం నుంచి వచ్చారు. కానీ ములాఖత్ సమయం ముగియడంతో ఆయనని పరామర్శించకుండానే తిరిగి వెళ్ళిపోయారు.

కానీ టీడీపిలో ఈ ఇద్దరు ‘చిన్న పిల్లోళ్ళు’ ఆదర గొట్టేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి తమ సత్తా చాటుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories