తెలంగాణాలో ముందస్తుకు లోకేష్ సై

Nara Lokesh ready for snap pollsతెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ టీడీపీ పోటీ చేయ్యడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో నేతలు పార్టీ వీడినా.. క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు వారి మద్దతుతోనే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపుతాం అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండొచ్చు అన్న ఊహాగానాల మధ్య తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులంటాయనేది పొలిట్‌బ్యూరోలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ADVERTISEMENT

మరోవైపు ఈ నెల 6న కేసీఆర్ అసెంబ్లీను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తాజా ఊహాగానాలు వస్తున్నవి. అసెంబ్లీని రద్దు చేసి ఆ మర్నాడు సిద్దపేటలో జరపబోతున్న భారీ బహిరంగసభ నుండి కేసీఆర్ సమరశంఖం పూరించే అవకాశం ఉందని సమాచారం. హరీష్ రావుకు ఈ సభ బాధ్యతలను అప్పగించారు.

ADVERTISEMENT
Latest Stories