రెడ్ బుక్…బ్లూ బ్యాచ్ ని భయపెడుతుందా.?

Nara Lokesh Red Book

2024 ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ రెడ్ బుక్ ఆ తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది, అంతేకాదు ఇతర రాజకీయ పార్టీలకు రెడ్ బుక్ ఒక ఆదర్శంగా మారింది, అలాగే పార్టీ అధినేతలకు, క్యాడర్ కి ఒక దిక్సూచిలా నిలబడింది.

అయితే తెలుగు రాష్ట్రాలలో ఇంతలా ప్రాధాన్యం దక్కించుకున్న లోకేష్ రెడ్ బుక్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా తన పని తానూ చేసుకుంటూ పోతుందా అంటే…అవును కానీ చట్టానికి లోబడి మాత్రమే అనే షరతులతో రెడ్ బుక్ తన చాఫ్టర్లలో ఇప్పటికి కేవలం మూడు పేజీలను మాత్రమే ఓపెన్ చేసిందంటూ లోకేష్ తాజాగా ప్రకటించారు.

ADVERTISEMENT

పీపీపీ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్న పారిశ్రామిక వేత్తలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలో జైల్లో వేస్తాం అంటూ జగన్ చేసిన బెదిరింపులకు స్పందించిన మంత్రి లోకేష్ మరోమారు బ్లూ మ్యాచ్ కి రెడ్ బుక్ ను గుర్తు చేసారు.

అయితే నిజంగా లోకేష్ హెచ్చరిస్తున్నట్టు రెడ్ బుక్ బ్లూ మ్యాచ్ ని భయపెడుతుందా అంటే అందుకు…జైలు నుంచి బైలు మీద బయటకొచ్చిన వల్లభనేని వంశీ ఇప్పటికి బయటకు రాలేకపోతున్నారు వై.? అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో నోటికి ఫిల్టర్ లేకుండా బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని వైసీపీ ఓటమితోనే గుండె నొప్పితో రాష్ట్ర సరిహద్దులు దాటేసారు..వై.?

జోగి రమేష్ బాబు సతీమణి భువనేశ్వరి విషయంలో వైసీపీ చేసింది తప్పు అంటూ ఒప్పుకోవడం వెనుక కారణం.? పర్శంటా, అర పర్శంటా తొందరెందుకు అంటూ మైకుల ముందు నోరు పారేసుకున్న మాజీ మంత్రి ఇప్పుడు నోరు మెదపడం లేకపోతున్నారు అంటే వై.? ఈ ప్రశ్నలన్నింటికీ “వై నాట్ రెడ్ బుక్” అనే సమాధానమే చెప్పాలేమో.

ఇలా గత వైసీపీ ప్రభుత్వంలో చట్టం దాటి, మానవత్వం మరిచి తెగబడిన సోకాల్డ్ నేతలంతా ఇప్పుడు కలుగులో దక్కున్న ఎలుకల మాదిరి బయటకురాలేకపోవడానికి ముఖ్య కారణం రెడ్ బుక్ అనేది వైసీపీ కూడా ఒప్పుకునే వాస్తవమే. మరి తాజాగా లోకేష్ రెడ్ బుక్ గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ కి హెచ్చరికలే అవుతాయేమో..!

అయితే వైసీపీ ని ఇంతలా భయపెట్టిన రెడ్ బుక్ ఇప్పటికి మూడు పేజీలను మాత్రమే ఓపెన్ చేసిందని, సమయం వచ్చినప్పుడు అందరు దాని మూల్యాన్ని చెల్లించాల్సిందే అంటూ మరోసారి బ్లూ సైన్యానికి రెడ్ బుక్ పవర్ గుర్తుచేశారు లోకేష్.

ADVERTISEMENT
Latest Stories