హేయ్… ఈ బాబు కూడా వేసేసాడు..!

Nara rohith croones for savitri movieగత కొన్ని సంవత్సరాలుగా హీరోలు పాటలు పాడే ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో టాప్ హీరోల నుండి వర్ధమాన తారల వరకు చాలా మంది హీరోలు తమ స్వరాన్ని సవరించారు. ఇదే కోవలో నారా వారి వారసుడు రోహిత్ కూడా చేరారు. తన తాజా చిత్రం “సావిత్రి” సినిమాకు సంబంధించి ఓ మాస్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది.

డైలాగ్ డెలివరీలో రోహిత్ ‘వాయిస్’ పవర్ గురించి అందరికీ తెలిసిందే. సెటిల్డ్ డైలాగ్స్ పలకడంలో రోహిత్ తీరే వేరు. అలాంటి స్వరంతో ఒక మాస్ సాంగ్ ను బాగానే ఆలపించాడు అన్న టాక్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే సెంటిమెంట్ పరంగా కూడా మున్ముందు తన సినిమాలలో పాటలు పాడతారేమో చూడాలి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories