మంత్రి పదవులకి బోనస్ కేసులు, జైలు… స్వీకరించక తప్పదు

Narayana Swamy questioned by SIT in Jagan liquor scam

మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కే.నారాయణ స్వామిని మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు నిన్న ప్రశ్నించినప్పుడు, చాలా ప్రశ్నలకు “నాకేమీ తెలియదు… అన్నీ ఆ పైవాళ్ళే చూసుకునేవారు… నేను నిమిత్త మాత్రుడిని,” అని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన రెండు విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఆయనకు ‘పైవాడు’ అంటే జగనే కదా? ఈ కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు కూడా ఇదే చెపుతున్నారు కదా?కనుక నారాయణ స్వామి చెప్పిన ఆ పైవాడిని పిలిచి ప్రశ్నించే సమయం దగ్గర పడినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT

జగన్‌ ఎప్పుడూ ‘నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు…’ అంటూ కూనిరాగాలు తీస్తుండేవారు. తన మంత్రివర్గంలో వారందరికీ పదవులు ఇచ్చి గౌరవించానని గొప్పగా చెప్పుకునేవారు. తన మంత్రుల చేత బస్సు యాత్రలు కూడా చేయించారు.

కానీ నారాయణ స్వామి నిన్న సిట్ విచారణలో చెప్పిన దాని ప్రకారం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకి తెలియజేయకుండా, అయన ప్రమేయం లేకుండానే లక్షల కోట్ల విలువగల మద్యం పాలసీని జగన్‌ రూపొందించారు. మంత్రి ప్రమేయం లేకుండానే 5 ఏళ్ళపాటు మద్యం కుంభకోణం చేశారని స్పష్టమవుతోంది.

అంటే జగన్‌ తన డమ్మీ మంత్రులను పెట్టుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారని అర్ధమవుతోంది. పేరుకే వారు మంత్రులు తప్ప వారికి ప్రభుత్వంలో విలువే లేదని మాజీ మంత్రి నారాయణ స్వామి మాటలతోనే స్పష్టమయ్యింది కదా?లేకుంటే ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు జగన్‌ని కార్యక్రమంలో నారాయణ స్వామిని ప్రధాన సూత్రధారిగా పేర్కొని ఉండేవారు. అయన కూడా ఈ కేసులో నుంచి బయటపడేందుకు తిప్పలు పడుతుండేవారు కదా?

జగన్‌ని నమ్ముకుంటే మంత్రి పదవులు లభిస్తాయని వైసీపీ నేతలు ఆశ పడటం సహజం. కానీ తర్వాత ఇటువంటి కేసులలో కూడా ఇరికిస్తారని, ఏదో రోజున జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుందని అప్పుడు వరూ గ్రహించకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా వైసీపీ నేతలు కళ్ళు తెరుచుకోవాలి కదా?

మంత్రి పదవులలో ఉన్నా గౌరవం లభించ లేదు. శాఖలతో మంత్రులకు ప్రమేయం లేకపోయినా ఈవిదంగా అవినీతి కేసులలో చిక్కుకోక తప్పడం లేదు. ఇలాంటి ‘పైవాడి’ని నమ్ముకొని జైలుకి వెళ్ళడం అవసరమా? వైసీపీ నేతలే ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories