
ఈరోజు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అత్యకంగా బిహార్ రాష్ట్రానికి నిధులు కేటాయించారు. మోడీ ప్రభుత్వం మనుగడకు జేడీయూ మద్దతు చాలా కీలకం. కనుక ఇదే అదునుగా ఆ పార్టీ అధినేత, సిఎం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కానీ కేంద్రం ఇవ్వ(లే)దని ఆయనకు ముందే తెలుసు. అయినా ఆ పేరుతో కేంద్రంపై ఒత్తిడి పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు దక్కేలా చేసుకోగలిగారు.
బిహార్‌లో రోడ్ల అభివృద్ధికే బడ్జెట్‌లో రూ.26,000 కోట్లు కేటాయించింది. అధికాక మరో రూ.21,000 కోట్లతో 2400 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించబోతోంది. బిహార్‌లో పర్యాటక కేంద్రాలు, టెంపుల్ కారిడార్ గయా, రాజ్‌గిరీని అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు కేటాయించింది.
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
అలాగే కొత్తగా మెడికల్ కాలేజీలు, విమానాశ్రయాలు, స్పోర్ట్స్ స్టేడియంలు వగైరాలు నిర్మించేందుకు, వరదల నియంత్రణకు కలిపి మరో రూ.11,500 కోట్లు కేటాయించింది. మొత్తం కలిపితే రూ.38,500 కోట్లు.
మోడీ ప్రభుత్వం మనుగడకు టిడిపి మద్దతు కూడా కీలకమే. నిధుల కోసం సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని నరేంద్రమోడీపై ఒత్తిడి చేశారు. కానీ నితీష్ కుమార్‌లాగా చెయ్యి మెలిపెట్టి తీసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ వీలైనంత ఎక్కువే రాబట్టుకునే ప్రయత్నాలు చేశారు. అందువల్లే బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ. 15,000 కోట్లు కేటాయించిన్నట్లు భావించవచ్చు.
Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
ఇదిగాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఉత్తరాంధ్రా, రాయలసీమలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కొత్త రైల్వే విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతామని బడ్జెట్‌లో హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈసారి తప్పకుండా విశాఖ-చెన్నై, అనంతపురం మీదుగా హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
ఏపీలో పోలవరంతో సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విదాల తోడ్పడతామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవేకాక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిద పద్దులు, ఏజన్సీల ద్వారా రాబోయే నెలల్లో మరింత ఆర్ధికసాయం అందజేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఇప్పుడు బలమైన సత్సంబంధాలు నెలకొని ఉన్నందున బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు కనపడకపోయినా, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు లభించడం ఖాయమే అని భావించవచ్చు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరూ పూర్తి భిన్నంగా కేంద్రంతో వ్యవహరించినప్పటికీ సానుకూల ధోరణితో ఏపీకి నిధులు సాధించుకోవడమే ఉత్తమం అని చెప్పవచ్చు.