మోడీ సర్కార్ ‘ప్రత్యేక హోదా’ను అడ్డుకునే ‘స్కెచ్’ ఇది!

narendra modi - arun jaitleyఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ రాకుండా అడ్డుకునేందుకు ఎన్డీయే సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని పొలిటికల్ వర్గాల టాక్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే ప్రైవేటు బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విపక్షాల మద్దతు కూడగట్టిన తరుణంలో దీనిని ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచించిన ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభను నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించింది.

నిజానికి నేటి నుండే రాజ్యసభను నిరవధిక వాయిదా వేయాలని ఎన్డీయే భావించినప్పటికీ, కొంత మంది రాజ్యసభ సభ్యుల కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికేందుకు రేపు సభను యథావిధిగా కొనసాగించాలని భావించింది. దీంతో రేపు వారికి వీడ్కోలు చెప్పిన అనంతరం సభను నిరవధిక వాయిదా వేయనున్నారని తెలుస్తోంది.

ADVERTISEMENT

ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బిల్లు చర్చకు వస్తే… ఆ తరువాత జరిగే ఓటింగ్ లో సంఖ్యా బలం లేని బీజేపీ కంగుతినే ప్రమాదం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సి రావచ్చు. దీనిని తప్పించుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిరవధిక వాయిదా మంత్రాన్ని ప్రయోగించనుంది. దీంతో ఎన్డీయే తన ఉద్దేశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి స్పష్టంగా చెప్పకనే చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories