పెద్ద హీరోయిన్, అన్నీ పెయిడ్ రివ్యూలే!

Hi movie sparks paid review debate

నయనతార, కవిన్ జంటగా నటించిన ‘Hi’ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా రిలీజ్ కాగానే తమిళనాడుకు చెందిన చాలా influencer handles ఒకేసారి రంగంలోకి దిగిపోయాయి. ‘Breezy Hit’, ‘New Age Film’, ‘Refreshing’ అంటూ పోస్టుల మీద పోస్టులు పెట్టేశాయి.

అవి చూసి సినిమాకు వెళ్లిన వాళ్ల పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అసలు వీళ్లు చూసిన సినిమా ఇదేనా అని తలలు పట్టుకుంటున్నారు.

ADVERTISEMENT

ఎందుకంటే ‘Hi’లో కొత్తదనం వెతికితే ఒక్క ఫ్రెష్ బ్లాక్ కూడా కనిపించదు. మొదటి సీన్ నుంచి చివరి వరకు ఎన్నోసార్లు చూసేసిన పాత ప్రేమకథనే మళ్లీ తీశారు. కథలో కానీ, స్క్రీన్ ప్లే లో కానీ, ట్రీట్మెంట్ లో కానీ కొత్తగా అనిపించే విషయం ఏదీ లేదు.

నవ్విస్తుందా అంటే అదీ లేదు. ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయా అంటే అదీ కష్టం. కానీ ట్విట్టర్ తెరిస్తే మాత్రం సినిమా గురించి వచ్చిన పోస్టులు చూస్తే ఏదో అద్భుతం తీసినట్టే కనిపిస్తుంది.

తమిళంలో వెబ్ సైట్ల రివ్యూలు ఉండవ్ కాబట్టి, ట్విట్టర్ హ్యాండిల్స్ ఇచ్చే రివ్యూలకే కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కల్చర్. పెద్ద హీరోయిన్ లేదా పేరున్న హీరో సినిమా అయితే చాలు, జెన్యూన్ రెస్పాన్స్ కంటే పైడ్ రివ్యూస్ ముందే వచ్చేస్తున్నాయి.

ఇదే విషయాన్ని ఒక X user కూడా చాలా డైరెక్ట్ గా చెప్పారు:

“#HiMovie – Yet another scam by the influencer groups. Such a boring, lifeless movie which offers no laughs. Outdated treatment and mediocre performances by all. Yet another forgettable outing for #Kavin.”

సినిమా నచ్చితే హిట్ అనడంలో తప్పు లేదు. కానీ ప్రేక్షకులకు సినిమాలో కనిపించని freshness, influencersకి మాత్రమే కనిపిస్తేనే అసలు అనుమానం మొదలవుతుంది!

మొత్తానికి సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు… payment పడితే review మాత్రం “Breezy Hit” అయిపోతుంది!

ADVERTISEMENT
Latest Stories