నయీం ‘వీక్ నెస్’తో సంచలనాలు నమోదవుతాయా?

Nayeemuddin, Nayeemuddin Link Tollywood Star Hero, Nayeemuddin Link Tollywood Top Hero, Nayeemuddin Link Tollywood Star Hero Natti Kumar Reveals గ్యాంగ్ స్టర్ నయీం దందాపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు, సినీ పరిశ్రమతో ఉన్న లింకులపై ఆరాతీస్తున్నట్టు సమాచారం. ఇందులో ఓ స్టార్ హీరో సినిమాకి నయీం పెట్టుబడులు పెట్టినట్టుగా, అలాగే ఓ క్రైం స్టోరీకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించినట్టుగా తెలుస్తోంది. నట్టి కుమార్ ఆరోపించినట్టు సినీ ముద్దుగుమ్మలతో గడపడం నయీం వీక్ నెస్ అని, దానిని అవకాశంగా చేసుకున్న పలువురు వ్యక్తులు అతనికి కావాల్సింది సరఫరా చేసి, వీరికి కావాల్సిన పెట్టుబడులు పొందారంటూ వచ్చిన ఆరోపణలపై సిట్ సమాచారం సేకరిస్తోంది.

ఇప్పటికే రంగంలోకి దిగిన సిట్ అధికారులు పలువురి నుంచి సమాచార సేకరణలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు వ్యక్తులు భయంతో బిక్కచచ్చిపోయారని ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. మరి ఈ విచారణలో సంచలన విషయాలు ఏమైనా వెల్లడి అవుతాయా? పెట్టుబడులు పెట్టిన ఆ స్టార్ హీరో సినిమా పేరు బయటకు వస్తుందా? అలాగే సినీ ముద్దుగుమ్మల పేర్లు వెలుగు చూస్తాయా? అన్నది మిక్కిలి ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories