హీరోగా డిఫరెంట్ సినిమాలను చేస్తూ ఎదుగుతోన్న హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం “నీది నాది ఒకే కధ” విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను అలరించడం… పాటలకు మంచి స్పందన రావడం… దానికి అనుగుణంగానే ట్రైలర్ కూడా వీక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ ట్రైలర్ లో హైలైట్ ఏంటి? అంటే మొదటగా హీరో శ్రీవిష్ణు పేరే వస్తుంది. తన నటన, యాసతో ఈ కధకు శ్రీవిష్ణు హైలైట్ లా కనపడుతున్నాడు. తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్ని ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించగా, నారా రోహిత్ సమర్పించిన ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. హిట్ కళ కనపడుతోన్న ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం, ఖచ్చితంగా సినిమాకు దోహదం చేస్తుందని చెప్పవచ్చు.



