ఈ ఎక్స్ పోజింగ్ కు ‘సెన్సార్’ లేదుగా..!

Neetu Chandra In See Through Dress At Femina Beauty Awards 2018సినిమాలలో అందాల ఆరబోతకు ‘సెన్సార్’ బోర్డు వారి నిబంధనలు ఉండడంతో, తాము ప్రదర్శించిన సౌందర్యాలు ప్రేక్షకుల వరకు చేరడం లేదని ఫీల్ అవుతున్నారో ఏమో గానీ, ఇటీవల కాలంలో సినీ ఈవెంట్ లు వచ్చాయంటే చాలు… హీరోయిన్ల అందాల విందుకు వేడుక రెడీ అయినట్లే భావించవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ నాట ఈ పోకడ మరీ ఎక్కువగా ఉండగా, తాజాగా ముగిసిన ‘నైకా ఫెమినా’ అవార్డుల వేడుక బాలీవుడ్ తారామణుల అందాల ప్రదర్శనతో హీటేక్కింది.

ADVERTISEMENT

ఈ వేడుకలో తాము హైలైట్ కావాలంటే తాము హైలైట్ కావాలనే విధంగా… ఒక్కొక్కరు అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో కెమెరా కళ్ళకు కన్నులవిందు చేసారు. ముఖ్యంగా ‘గోదావరి’ ఫేం నీతూచంద్ర అందరి కంటే ఎక్కువగా చెలరేగిపోయింది. బ్లాక్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో అమ్మడి సౌందర్యాలకు ఫోటోగ్రాఫర్లు ముగ్ధులయ్యారు. బహుశా ఇలాంటి కార్పొరేట్ సినీ వేడుకలకు కూడా ‘సెన్సార్’ నిబంధనలు వర్తింపచేయాలేమో అన్న చందంగా అందాల ప్రదర్శన చేసి హాట్ టాపిక్ అయ్యింది.

ఆ మాటకొస్తే… ఒక్క నీతూనేనా… ‘తీన్ మార్’ ఫేం కృతికర్భందా, ‘భరత్ అనే నేను’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కైరా అద్వానీ, ‘హార్ట్ అటాక్’ పాప ఆదా శర్మ, ‘డీజీ’ బ్యూటీ పూజా హెగ్డే… వరుసపెట్టి ఫోజులిచ్చి మతి పోగొట్టారు. తాము నటించిన సినిమాలు మిస్సయినా పర్లేదు గానీ, ఇలాంటి ఈవెంట్ లు మాత్రం మిస్ కావద్దు అనే విధంగా వీక్షకులను ఆకర్షించడంలో సక్సెస్ అవుతున్నారు. గత రెండేళ్ళ కాలాన్ని పరిశీలిస్తే… టాలీవుడ్ బ్యూటీలు కూడా ఇదే బాటలో పయనిస్తుండడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories