టీజర్ టాక్ – యువ హృదయాలను కొల్లగొడుతున్న కీర్తి లుక్స్!

Nenu Local Keerthy Suresh Trailer First Look‘నాచురల్ స్టార్’ నాని చెప్పింది నిజమే. హీరోయిన్ కీర్తి సురేష్ మీ గుండెలను కొల్లగొడుతుందని, కీర్తి గుండెలను నేను కొల్లగొడతానని… అది ఎలాగో తెలుసుకోవాలంటే “నేను లోకల్” టీజర్ విడుదలయ్యే వరకు వేచిచూడండి… అంటూ ఒక ట్వీట్ చేసాడు. మరి ఆ సమయం వచ్చేసింది… “నేను లోకల్” టీజర్ విడుదలయ్యింది. నాని చెప్పినట్లు కీర్తి తన లుక్స్ తో యువ హృదయాలను కొల్లగొట్టడం ప్రారంభించింది.

దేవిశ్రీప్రసాద్ అందించిన సూపర్ బ్యాక్ గ్రౌండ్ తో విడుదలైన 26 సెకన్ల టీజర్ లో ఒక్క సెకన్ లో కూడా డైలాగ్ లేకపోయినా… నాని, కీర్తి సురేష్ ఇచ్చిన హావభావాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి, మరోసారి ఈ టీజర్ ను రిపీట్ మోడ్ లో చూసేలా చేస్తోంది. చూడబోతుంటే… ఈ నాచురల్ స్టార్ ఖాతాలో మరో బంపర్ హిట్ పడడం ఖాయంగా కనపడుతోందని నెటిజన్లు ఖరారు చేసేస్తున్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories