‘టెంపర్’ తరహా పబ్లిసిటీలో ‘నేను.. శైలజ…’

ram pothineni nenu sailaja deleted scenesసినిమా నిడివి, కధకు తగ్గ ప్రాధాన్యత రీత్యా ఎడిటింగ్ విభాగంలో పలు సీన్లకు ‘కత్తెర’ పడుతుంటాయి. అయితే సాధారణంగా అవి ఎడిటింగ్ రూమ్ వరకే పరిమితమవుతాయి. కానీ, కొన్ని సినిమాల సన్నివేశాలను మాత్రం, ఆయా చిత్రాలు విడుదలై ప్రజాదరణ పొందుతున్న సమయంలో విడుదల చేస్తుంటారు.

అదే విధంగా “టెంపర్” సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా పబ్లిసిటీ కోసం, ఎడిటింగ్ లో కట్ అయిన కొన్ని సీన్లను దర్శకుడు పూరీ జగన్నాధ్ యూ ట్యూబ్ లో విడుదల చేసారు. గతంలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” వంటి సినిమాల సందర్భంలో కూడా బ్రహ్మానందం పాల్గొన్న పలు సన్నివేశాలు విడుదల చేసినప్పటికీ, ఆ సమయానికి ‘సీతమ్మ’ ధియేటర్ల నుండి వెళ్ళిపోయింది. కానీ, ‘టెంపర్’ సన్నివేశాలను మాత్రం, ఆ సినిమా విడుదలైన కొద్ది రోజులకే దర్శకుడు పూరీ రిలీజ్ చేసి, సరికొత్త ప్రచారానికి తెరలేపారు.

ADVERTISEMENT

ఇదే ఫార్ములాను ప్రస్తుతం రామ్ “నేను.. శైలజ…” చిత్రం అనుసరిస్తోంది. ఈ ఏడాది ప్రారంభ రోజున విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమా ఎడిటింగ్ లో కత్తెరించిన ఓ సన్నివేశాన్ని హీరో రామ్ యూ ట్యూబ్ లో విడుదల చేసారు. బీచ్ పక్కన రామ్ తో పాటు సుడిగాలి సుధీర్ నటించిన ఈ సన్నివేశం చూసిన తర్వాత ఖచ్చితంగా కోతకు గురవ్వాల్సిందే అని అనిపిస్తుంది. దాదాపు 90 సెకన్ల నిడివి గల ఈ సన్నివేశంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఒక్క ఫోటోగ్రఫీ తప్ప!

ADVERTISEMENT
Latest Stories