‘స్పెషల్ స్టేటస్’పై యువ హీరో కామెంట్స్!

nikhil siddharth tweets on special statusఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ టాలీవుడ్ యువహీరో నిఖిల్ సిద్ధార్థ్ డిమాండ్ చేసారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన నిఖిల్… నేను కేవలం నటుడ్నే. కొంత మంది ఇవన్నీ నీకెందుకు అంటున్నారు. కానీ నేను ఈ మధ్య ఏపీ వ్యాప్తంగా షూటింగ్ ముగించుకుని వచ్చాను. ఏపీని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT

అలా చేయాలంటే ఏపీకి నిధులు కావాలి, అలా నిధులు కావాలన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందాలన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా తాను రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నాను… అంటూ ట్వీట్ చేశాడు. కాగా, నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories