అభిమాని చేతికి చిక్కిన పవన్ కళ్యాణ్!

Nithiin-buys-Katamarayudu-Nizam-distribution-rightsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యువహీరో నితిన్ ఎంతటి అభిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ సినిమా వస్తుందంటే… చిత్ర యూనిట్ కంటే ముందునుండే ఒక సాధారణ అభిమాని మాదిరి, సోషల్ మీడియాలో ఆ సినిమాకు పబ్లిసిటీ చేస్తుంటారు నితిన్. బహుశా తాను నటించిన సినిమాలకు కూడా అంతగా పబ్లిసిటీ చేస్తారో లేదో గానీ, పవన్ సినిమా వస్తుందంటే నితిన్ లో పండగ వాతావరణం కనపడుతోంది. ప్రస్తుతం కూడా అలాంటి ఛాయలే కనపడుతున్నాయి. అయితే ఈ సారి పవన్ సినిమా విడుదల గురించి మాత్రం కాదు.

తన అభిమాన హీరో సినిమా “కాటమరాయుడు”ను నైజాం హక్కులను దక్కించుకున్న సందర్భంగా పవన్ స్టిల్ ను పోస్ట్ చేసి, సదరు విషయాన్ని ధృవీకరించాడు నితిన్. ఏషియన్ ఫిల్మ్స్ తో పాటు శ్రేష్ట్ మూవీస్ సంస్థ ‘కాటమరాయుడు’ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయనున్నామని ప్రకటిస్తున్నందుకు చాలా థ్రిల్ గా ఉందని నితిన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో నైజాం ఏరియాలో భారీ స్థాయిలో ‘కాటమరాయుడు’ విడుదల కానుందని, తద్వారా భారీ ఓపెనింగ్స్ పవన్ వశం అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories