నో డౌట్..! ‘లెజెండ్’ను మించిన హిట్ ‘డిక్టేటర్’

no-doubt-dictator-is-bigger-than-legend-nandamuri-balakrishna“రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్న సమయంలో నేను నటించిన ‘డిక్టేటర్’ సినిమా విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉంది. నో డౌట్… ‘లెజండ్’ను మించి ‘డిక్టేటర్’ చిత్రం విజయవంతం అవుతుంది’ అని అభిమానులను ఉద్దేశిస్తూ ఈ నందమూరి హీరో వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్ లో అభిమానులతో కలిసి “డిక్టేటర్” చిత్రాన్ని వీక్షించిన అనంతరం బాలయ్య పంచుకున్న అనుభూతులవి. “అభిమానులతో కలసి సినిమాను చూడటం తనకు కొత్త సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకర్షిస్తుందని అన్నారు. హిట్ మాట ఏమో గానీ తొలి రోజు ఓపెనింగ్స్ మాత్రం బాలకృష్ణ చెప్పిన స్థాయిలో రావచ్చని సినీ పండితులు చెప్తున్నారు.

సినిమా ముగిసిన అనంతరం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తన వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు ఈ హిందూపురం ఎమ్మెల్యే. మనవడు దేవాంశ్ తో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన నిన్న రాత్రే అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజామునే ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలయ్య అక్కడ బోగి మంటలు వేసి పండగ చేసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories