ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ కోడ్ లేనట్టే

No Election Code for MLC Elections 2019 in andhra pradeshరెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలకుగాను కొద్ది రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఐదు కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగ్ అనివార్యం అవుతుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం టీడీపీకి నాలుగు, ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఒక్కటి లభిస్తాయి.

రెండు పార్టీలలో ఏ పార్టీ అయినా అంత కంటే ఎక్కువ అభ్యర్థులను పెడితే ఓటింగు తప్పదు. ఓటింగు జరగాల్సిన పరిస్థితి ఉంటే మార్చి 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వస్తాయి. పోటీ అంటూ లేకపోతే నామినేషన్ల చివరి రోజైన మర్చి 5నే ఫలితాలు తెలిసిపోతాయి ఏకగ్రీవంగా. మరోవైపు కోడ్ పై కూడా ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎమ్యెల్యే కోటా ఎన్నికలకు కోడ్ వర్తించదని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెల్లడించారు. దీనితో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది.

ADVERTISEMENT

ఇప్పటివరకు ఎమ్మెల్సీ కోడ్ మొదలు సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కోడ్ అమలు లో ఉంటుంది అనే పుకారు ఉంది. ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వడంతో ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తుందో అప్పటి నుండే కోడ్ అమలు లోకి వచ్చినట్టు. తాజాగా మనకు ఉన్న సమాచారం ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో రెండు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తుంది. కోడ్ అమలు లోకి వచ్చే వరకూ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు ప్రకటించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories