నాగార్జున అనుష్క పాటలు పాడుకోరట!

No Romance between anushka shetty and nagarjuna in RGV movie!కింగ్ నాగార్జున సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా అనుష్క ను తీసుకున్నట్టు సమాచారం. గెస్ట్ రోల్స్, స్పెషల్ రోల్స్ కలిపి ఈ జోడి ఇప్పటిదాకా 11 సినిమాల్లో నటించింది. ఇది వారి 12వ సినిమా. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమాలో పాటలు ఉండవట.

ADVERTISEMENT

అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో అసలు హీరోయిన్ పాత్ర ఉండదట. కేవలం ఒక ముఖ్యమైన స్త్రీ పాత్ర కోసం అనుష్క ను తీసుకోబోతున్నారంట. వారి ఇద్దరి మధ్య ఎలాంటి రొమాన్స్ ఉండదట. తంలో నాగార్జున రామ్ గోపాల్ వర్మ కలిసి శివ, అంతం, మరియు గోవిందా గోవిందా సినిమాలు చేసారు. ఇందులో శివ సినిమా తెలుగు సినిమా గమనానే మార్చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ అనంతరం నాగార్జున చిన్న బ్రేక్ తీసుకుని అఖిల్ హలో సినిమా పనులు ఒక నెల పాటు చూస్తారు. తరువాత జనవరిలో తిరిగి ఈ సినిమా మొదలు పెడతారు. వేసవి కానుకగా ఏప్రిల్ లో సినిమా విడుదల చెయ్యాలని ప్రస్తుతానికి ఉన్న ప్లాన్.

ADVERTISEMENT
Latest Stories