ఎన్టీఆర్ బయోపిక్… ఏం జరుగుతోంది..?

NTR -Biopic-తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనున్నట్టుగా వచ్చిన వార్తలు తెలిసిందే. అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయని చెప్పారు. ‘జై సింహా’ తరువాత బాలకృష్ణ ఈ సినిమాతో సెట్స్ పైకి వెళతారు అని అన్నారు. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చాలా పాత్రలకు కొత్తవాళ్లను తీసుకోనున్నారు.

వాళ్లకి శిక్షణ ఇచ్చిన తరువాతనే షూటింగ్ మొదలుకానుంది. అందువలన ఈ సినిమా జూలైలో మొదలు కావొచ్చని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్ తో తేజ సినిమా చేస్తుండటం… చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ సినిమా నిర్మాణ వ్యవహారాలను సాయి కొర్రపాటి చూస్తుండటం… బాలకృష్ణ మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉండటం ఈ వార్తకు బలాన్నిస్తోంది. నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories