మహేష్ మాదిరి అభినయాన్ని ప్రదర్శించిన జూనియర్ ఎన్టీఆర్?

ntr following Mahesh footstepsజూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” ఫిల్మ్ గురించి ఇటు సోషల్ మీడియా.. అటు ఫిల్మ్ ఇండస్ర్టీలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడు మాస్‌గా కనిపించే జూనియర్, ఈ సారి క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యే విధంగా స్టైలిష్‌గా కనిపించడం సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది. అలాగే డైలాగ్స్ డెలివరీ కూడా హాలీవుడ్ మాదిరిగా ‘వెల్ సెట్టేల్ద్’గా కాస్త మహేష్ బాబు అభినయాన్ని గుర్తు చేస్తోందని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు.

ఫస్ట్ టైమ్ జూనియర్- సుకుమార్ కాంబో కావడంతో ప్రేక్షకుల్లో ఏర్పడిన క్యూరియాసిటీని మరింతగా పెంచే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఈ సినిమాలో మూడు లేదా నాలుగు సన్నివేశాలు హైలైట్ అవుతాయని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం. ఫాదర్ సెంటిమెంట్‌పై వస్తున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించిన రాజేంద్రప్రసాద్ – ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టాక్.

ADVERTISEMENT

అలాగే సినిమాలో వచ్చే హాస్పటల్ సీన్లు… ఒకప్పటి ‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు. అలాగే జగపతిబాబు – జూనియర్, ఎన్టీఆర్ డైలాగ్స్, సాంగ్స్, స్టెప్స్ అన్నీ కలిసి “నాన్నకు ప్రేమతో” సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి ఈ విషయాలలో ఎంత వాస్తవముందనేది జనవరి 13వ తేదీన తెలియబోతోంది. ఎందుకంటే, అదే రోజున సినిమా విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ADVERTISEMENT
Latest Stories