ఎన్టీఆర్ అభిమానుల కోరిక ఇన్నాళ్లకు తీరబోతుందా?

ntr koratala siva new movie music director anirudh ravichanerచాలా కాలం నుండి ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో సినిమాలకు థమన్, దేవి శ్రీ ప్రసాద్ కాకుండా ఫ్రెష్ ఫేస్ కావాలని తమ అభిమాన నటుడిని కోరుతున్నారు. దక్షిణాదిన నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన అనిరుధ్ రవిచందర్ తో పని చెయ్యాలని వారి కోరిక. అయితే అది ఇప్పటిదాకా నెరవేరలేదు.

ఇప్పుడు మొత్తానికి అభిమానుల మోర తారక్ ఆలకించాడని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ కోసం అనిరుధ్ రవిచందర్ తో కలిసి పనిచేయాలని యోచిస్తున్నాడట. #NTR30 గా పేర్కొనబడుతున్న ఈ కొత్త చిత్రం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసాకా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ADVERTISEMENT

అనిరుధ్ బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్లను ఇవ్వడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నాడు. అతని పాటలు కొన్ని తెలుగులో చార్ట్‌బస్టర్లుగా మారినప్పటికీ, అతను తెలుగులో తమిళనాట వచ్చినటువంటి విజయాన్ని పునరావృతం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు అజ్ఞాతవాసి, ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ వంటి తెలుగు చిత్రాలకు అనిరుధ్ సంగీతం సమకూర్చారు.

నాని నటించిన ‘జెర్సీ’ చిత్రంలో ఆయన సంగీతాన్ని విమర్శకులు మెచ్చుకున్నారు. కానీ అతను ఇంకా తెలుగులో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని రుచి చూడలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరిపోవాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. దానికంటే ముందు ఈ వార్త అధికారికంగా ధృవీకరింపబడాలి.

ADVERTISEMENT
Latest Stories