2 మిలియన్ క్లబ్ లో “నాన్నకు ప్రేమతో”

ntr nannaku prematho in 2 million clubజూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా యుఎస్ మార్కెట్ లో ఏకంగా 2 మిలియన్ మార్క్ ను అందుకుంటోంది. ఈ సందర్భంగా యుఎస్ అభిమానులు ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించుకుంటున్నారు.

ఓవర్సీస్ తొలిస్థానంలో పోటీ లేకుండా ‘బాహుబలి’ నిలువగా, రెండవ స్థానంలో 3 మిలియన్ దరిదాపుల్లో “శ్రీమంతుడు” నిలిచింది. దీంతో 2 మిలియన్ మార్క్ ను అందుకున్న ‘నాన్నకు ప్రేమతో’ మూడవ స్థానాన్ని ఆక్రమించింది. అమెరికాను మంచు తుఫాన్ ముంచేయడంతో అందని ద్రాక్ష అనుకున్న ఈ ఫీట్ ను జూనియర్ అభిమానులు సాధించారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ షోను కూడా వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక, ఏపీ, తెలంగాణా విషయాలకు వస్తే, యుఎస్ అంత ఒరవడి లేకపోయినా సినిమాకు పరవాలేదనే కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. తొలుత వెలువడిన టాక్ తో భారీ నష్టాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ ఆ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే జూనియర్ అభిమానులు ఆశించినట్లు 50 కోట్ల క్లబ్ అనేది ట్రేడ్ వర్గాల నుండి ఖరారు కావాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories