అంచనాలు వేసిన విధంగానే జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమా తొలిరోజు మంచి వసూళ్లను సాధించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన “నాన్నకు ప్రేమతో” సినిమాకు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వచ్చినప్పటికీ, తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు 13.5 కోట్లు వసూళ్ళతో సత్తా చాటింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లతో కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 20 వరకు చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఏపీ, తెలంగాణా వసూళ్లను పరిగణనలోకి తీసుకుంటే మొదటి స్థానంలో “బాహుబలి” దాదాపు 23 కోట్లతో చెక్కుచెదరకుండా వుండగా, ప్రిన్స్ మహేష్ బాబు “శ్రీమంతుడు” షుమారు 14.7 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న “బ్రూస్ లీ”ని వెనక్కినెట్టి, “నాన్నకు ప్రేమతో” 13.5 కోట్లతో టాప్ 3 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రాల మాదిరిగానే తొలి రోజు వసూళ్ళతో సత్తా చాటిన “నాన్నకు ప్రేమతో” బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదో తెలియాలంటే మరో రెండు, మూడు రోజులు గడవాల్సిందే. ఇదే సమయంలో గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.





