పట్టాలెక్కనున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా

NTR new look goes viralటాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల నుంచి అందరూ ఎదురుచూస్తున్న కాంబో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో..ఈ ఇద్దరి కలయికలో సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.మొత్తానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ యిద్దరిని కలిపింది.అన్నీ సవ్యంగా జరిగుంటే 2013లోనే వీళ్ళ సినిమా పట్టాలెక్కాల్సింది.అప్పుడు మిస్సయినా ఎట్టకేలకు ఈ సంవత్సరం కొబ్బరికాయ కొట్టేశారు.

ADVERTISEMENT

అయినా కూడా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.కారణం ఏంటంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ని కోరిన ఒక కోరిక.అదేంటంటే ఈ సినిమాకోసం తారక్ తన లుక్ మార్చుకోవాలని కండిషన్ పెట్టాడట గురూజీ.సినిమాలో ఎన్టీఆర్ లుక్ గురించి వివరిస్తూ ఇప్పుడున్న బరువు బాగా తగ్గించి సన్నబడాలని స్లిమ్ గా తయారవ్వాలని కోరాడట.దీనికి ఎన్టీఆర్ కూడా సరేనన్నాడు. ఇంకేముంది ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ని పెట్టించుకుని మరీ ఎన్టీఆర్ బరువు తగ్గిస్తున్నాడు.జిమ్ లో ఎన్టీఆర్ వర్కువుట్స్ చేస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో,సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న మొట్ట మొదటి సినిమా కావడంతో ఇద్దరూ తెగ కష్టపడుతున్నారని అంటున్నారు సినీ జనాలు.త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా దర్శనమివ్వనున్నాడో అని ఎదురుచూస్తున్న అభిమానులకు హోలీ పండుగ రోజు సోషియల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ నిజంగానే పండుగ తెచ్చింది.ఎన్టీఆర్ తన స్నేహితుడితో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ ఫోటోలో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి పోయాడు.అంత స్లిమ్‌గా ఉన్న ఎన్టీఆర్ ని చూసి ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయబోయే ఈ సినిమా ప్రేమకథా చిత్రమని?దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ లవర్ బాయ్ లా చేంజ్డ అయ్యాడని లవ్‌స్టోరీకి పర్ఫెక్ట్ గా సరిపోయే లుక. లోకి వచ్చాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories