సెలబ్రిటీలతో ఆడేసుకోబోతున్న టాప్ యాంకర్!

Ohmkar-Sixth-Sense-Star-Maaచిన్న పిల్లలతో ‘ఆట’ డ్యాన్స్ షోతో బాగా పాపులర్ అయిన యాంకర్ ఓంకార్, గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ‘రాజు గారి గది’ సిరీస్ లో రెండు సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ లు అందుకున్న ఓంకార్, మళ్ళీ బుల్లితెరపై తన యాంకరింగ్ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. ఈ సారి చిన్న పిల్లలతో కాకుండా, సెలబ్రిటీలను ఒక ‘ఆట’ ఆడుకునేందుకు రెడీ అవుతున్నాడు.

‘సిక్స్త్ సెన్స్’ పేరుతో మొదలు కాబోతున్న ఈ షో ‘స్టార్ మా’ ఛానల్ లో ప్రసారం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ ప్రోమోను వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలతో షో నిర్వహించడం రొటీన్ అయిపోయిన నేపధ్యంలో… ‘సిక్స్త్ సెన్స్’ను పేరుతో సెలబ్రిటీల ‘సెన్సెస్’ను యాంకర్ గా ఓంకార్ పరీక్షించబోతున్నాడు. విడుదల చేసిన ప్రోమోలో ఓంకార్ అయితే పెంచిన గడ్డంతో మ్యాన్లీగా కనపడుతున్నాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories