ఈ ప్రోమో బాగుంది… ఈ సారైనా హిట్ వస్తుందా..!

Okka Kshanamమెగా హీరోగా అడుగుపెట్టిన అల్లు శిరీష్ కు ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదనే చెప్పాలి. ఉన్నంతలో గత చిత్రం “శ్రీరస్తు శుభమస్తు” పరవాలేదనిపించే విధంగా ఉండగా, ప్రస్తుతం ఆశలన్నీ “ఒక్క క్షణం” సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు పాజిటివ్ స్పందన రావడం చెప్పుకోదగ్గ విషయం.

అలాగే తాజాగా ఓ వీడియో ప్రోమోను కూడా విడుదల చేసారు. ‘సో మెనీ సో మెనీ…’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్ చిత్రీకరణ చూడముచ్చటగా ఉంది. వీడియోలో కనిపించిన శిరీష్, సురభిలు అందంగా కనిపించారు కూడా! అలాగే పాట కూడా వినసొంపుగా ఉంది. టీజర్ తో మొదలైన పాజిటివ్ నెస్ ను ఈ ప్రోమో కొనసాగించడంలో సక్సెస్ కావడంతో, అల్లు శిరీష్ కు ఈ సినిమాతో కావాల్సిన విజయం దక్కుతుందేమో చూడాలి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories