oldage-pensions-andhra-pradesh

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ సేవలను రద్దు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పింఛన్ అందించే వాలంటీర్లను ఈనెల పింఛన్ పంపణీకి అనుమతివ్వలేదు ఈసీ.

దీనితో వైసీపీ ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని శోధించకుండా లబ్దిదారులకు పింఛన్ అందించడం మానేసింది. దీనితో లబ్ధిదారులు ఈనెల పింఛన్ రాలేదే అంటూ వాలంటీర్లను నిలదీయగా ఇదంతా టీడీపీ చంద్రబాబు నాయుడి పనే అంటూ మరోకొత్త నాటకానికి తెరలేపింది.

ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికే వైసీపీ ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గత ఐదేళ్ల నుంచి వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి ప్రభుత్వ కార్యక్రమాలు అంటూ పార్టీ అవసరాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల విధులలో ఈ వాలంటీర్ వ్యవస్థను కట్టడి చేయాలంటూ పలు పార్టీలు ఈసీకి పిర్యాదు చేసిన మాట వస్తావే అయినప్పటికి ఇలా లబ్ధిదారులకు పింఛన్లు ఆపేయమని ఏ పార్టీ కూడా ఫిర్యాదు చేసే సాహసం చేయలేదు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ రెండు నెలలు లబ్ధిదారులు వారి వారి సచివాలయాలుకు వెళ్లి పింఛన్ తీసుకోవాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్ అందించలేకపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన పై తన పార్టీ పై వైసీపీ చేస్తున్నఈ అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ….పిన్షన్ పంపణీ చేయొద్దని టీడీపీ ఎవరిని కోరలేదు, రాష్ట్ర ఖజానా కాళీ చేసి ఆ నేరాన్ని టీడీపీ పై వెయ్యాలని చూస్తున్న వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలంటూ తమ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.

అలాగే వాలంటీర్ల పై ఈసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో లబ్దిదారులకు పింఛన్ ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేయాలంటూ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ నేతలు వినతి పత్రం అందించారు. ఈ నెల 5 లోపు రాష్ట్రంలో పెన్షన్ పంపణీ పూర్తి చేసేలా చూడాలంటూ కోరారు. ఈసీ ఉత్తర్వులను అమలు చేయవల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ ఈ వ్యవహారంలో వైసీపీ, టీడీపీని దోషిగా నిలబెట్టాలి కుట్రలు పన్నుతుందంటూ ఎదురుదాడి చేసారు టీడీపీ నేతలు.

అయితే ఇదంతా ఇలా ఉంటే సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 1 వ తేదీ వచ్చింది పెన్షన్ ఇంటికి రాలేదు అంటూ ఒక అవ్వ వాలంటీర్ ను ప్రశ్నించినట్టు…అందుకు ఆ వాలంటీర్ దీనికంతా చంద్రబాబే కారణం, మీకు ఇంటికి తెచ్చి పిన్షన్ ఇవ్వడం గిట్టక బాబే పిన్షన్ ఆపేసాడు అర్దమైయిందా అంటూ ఆ వాలంటీర్ ఆ అవ్వను ప్రభావితం చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో ను పోస్ట్ చేసారు భార్గవ్.

ఈ వీడియో లో సదరు వాలంటీర్ జగన్ అధికారంలో వస్తే మరో రెండు నెలలో మళ్ళీ మీ ఇంటికే పిన్షన్ తెచ్చే బాధ్యత మాదే ( వాలంటీర్లదే), ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇక ప్రతి నెల ఇలా పిన్షన్ కోసం రోడ్డెక్కాలి. తెలుసుగా మన గుర్తు ఏంటో….అది…అంటూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను పోస్ట్ చేసారు సజ్జల భార్గవ్. టీడీపీ ని ఇరుకునపెట్టడానికి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ఎన్నికలో వైసీపీ చేస్తున్న కుట్రలను బయటపెట్టింది.

ఒక వాలంటీర్ ఒక నెల పిన్షన్ ఆసరాగా చేసుకుని ఒక అవ్వను ఎలా ప్రభావితం చేస్తున్నాడో ఈ వీడియోలో స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలా కొన్ని వేల మంది వాలంటీర్లు రాష్ట్రమంతా కొన్ని లక్షల మంది ఓటర్లను బయపెట్టో, బెదించో ఎలా ప్రభావితం చేయగలరో ఈ ఒక్క వీడియోతో స్పష్టమయ్యిపొయింది. ఇటువంటి వీడియో లను పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలిగా భార్గవా..? ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నట్టే వాలంటీర్లను అడ్డుపెట్టుకుని జగన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి సిద్ధపడ్డారు అనేది ఈ వీడియోతో తేలిపోయింది.

నేను ఒంటరిని నాకు మీరే స్టార్ క్యాంపెయినర్లు, నాకు మీడియాలు లేవు, దత్తపుత్రుడు లేడు, మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు అంటూ మైకుల ముందు మేకపోతు గాంభీర్యాలు పోవడం తెరవెనుక ప్రతిపక్ష పార్టీల మీద ఇటువంటి కుట్రలు పన్నడం వైసీపీ కి ఆనవాయితీగా మారిపోయింది అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.