బ్యాంకుల దగ్గర బట్టలు తీసేసి నగ్నంగా మారుతున్నారు!

Old man stripped clothes in front on Bank ATMబ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడుతున్న వారి సహనం క్రమంగా నశిస్తోంది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధానంగా తమకు తోచిన విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన ఓ ఘటనలో ఒక మహిళ తన టాప్ ను తీసేసి నిరసన తెలియజేయగా, తాజాగా సోషల్ మీడియాలో ఓ వృద్ధుడు పూర్తిగా నగ్నంగా మారిపోయిన వీడియో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

తన శరీరంపై ఉన్న వస్త్రాలన్నీ తీసేసి జాతీయ జెండా పట్టుకుని నడిరోడ్డు పైన పడుకుని నిరసన తెలియజేసాడు ఓ వృద్ధుడు. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడ్ని పక్కకు తీసుకువెళ్ళి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతను వినకుండా మళ్ళీ రోడ్డుపైకి రావడానికి ప్రయత్నించడం, అతని యొక్క విరక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. తన డబ్బును తానూ తీసుకునేందుకు ఇంతసేపు ఎందుకు వెయిట్ చేయాలంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన తీరు వీడియోలో స్పష్టమవుతోంది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో గానీ, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందీలో మాట్లాడుకోవడంతో ఈ ఘటన కూడా ఉత్తరాదినే జరిగి ఉంటుందని తెలుస్తోంది. సమయం గడుస్తున్న కొద్దీ ఇలాంటి ‘నగ్న’ ఘటనలు ఎక్కువ అవుతుండడం గమనించదగ్గ విషయం. బహుశా ఇది కూడా దేశంలో ఒక ‘ట్రెండ్ సెట్టర్’గా మారుతుందేమో..!

ADVERTISEMENT
Latest Stories