ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి మద్యం షాపులు తెరుచుకున్నాయి. మందు బాబులను తాగనివ్వకుండా ఉంచడానికి అంటూ ప్రభుత్వం మద్యం రేట్లను 25 శాతం పెంచేసింది. రెడ్ జోన్లలోని కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని చోట్లా షాపులు ఓపెన్ అయ్యాయి. అయితే ఆ పెంపు ప్రభుత్వ ఖజానాను నింపుతుంది గానీ మద్యప్రియులను ఆపే అవకాశమే లేదని తేలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మద్యం షాపుల ముందూ మందు బాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల కిలోమీటర్ మేర క్యూలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం మాస్కులు ధరించాలి, సాంఘిక దూరం పాటించాలని చెప్పినా వినేవాడే లేకుండా పోయాడు. తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ కాకపోవడంతో సరిహద్దు జిల్లాలలోని ప్రజలు ఏపీ షాపుల ముందు బారులు తీరుతున్నారు.
వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే…. 40 రోజుల పాటు లాక్ డౌన్ వల్ల ఆపగలిగిన కేసులు ఈ దెబ్బతో విజృంభిస్తాయా అనే భయం కలిగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. తిరుపతి నగరంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్‌లను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.
దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటలలో 67 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,650కు చేరింది. గ్రీన్, ఆరంజ్ జోన్లలో భారీగా ఆంక్షలు సడలించడం, ఇప్పుడు మద్యం షాపులు కూడా తెరవడంతో కేసులు పెరుగుతాయా అనేది చూడాలి.
https://twitter.com/PVSIVAKUMAR1/status/1257236517950349312
https://twitter.com/sriikanth_/status/1257236875091140608
కరోనా వాక్సీన్ కి కూడా ఇంత డిమాండ్ ఉండదేమో. pic.twitter.com/SUBIMGXezb
— Journey with Jogu (@JogulambaV) May 4, 2020
My Royal Salute to the warriors… #wineshops #IndiaFightsCorona pic.twitter.com/gSTeKHWgIf
— …. (@ynakg2) May 4, 2020
https://twitter.com/AryaVj_/status/1257231315507658752
@ysjagan గారు మీ అనాలోచిత నిర్ణయం వలన మద్యం షాపులు దగ్గర పరిస్థితి చూడండి. pic.twitter.com/cPxUSzuV3o
— Hari Krishna Thakkilapati (@choudary321in) May 4, 2020
Lot of people from TN have crossed the border to #Nagari in #Chithoor district for liquor..
TN – AP Border..
One more video.. Distancing gone for a Toss.. pic.twitter.com/VnjRAiBbpL
— Ramesh Bala (@rameshlaus) May 4, 2020
https://twitter.com/AryaVj_/status/1257225286094970880
https://twitter.com/AryaVj_/status/1257218888103677954
ఆరు వారాలుగా తినడానికి తిండిలేక, చేయడానికి పనిలేక అల్లాడుతున్న పేదలకు ఓ 5 వేలు ఇచ్చేందుకు మనసురాని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గారికి, వ్యసనాన్ని “క్యాష్“ చేసుకుని పేదలు బతుకు దుర్భరంగా మార్చేందుకు బ్రాందీ దుకాణాలు మాత్రం తెరిచారు.#APInUnsafeHands #LiquorShop pic.twitter.com/KIXZsIhczH
— Adireddy Srinivas (@Adireddy_Vasu) May 4, 2020
Lot of people from TN have crossed the border to #Nagari in #Chithoor district for liquor..
TN – AP Border..
One more video.. Distancing gone for a Toss.. pic.twitter.com/VnjRAiBbpL
— Ramesh Bala (@rameshlaus) May 4, 2020



