ఆపరేషన్ సింధూర్ రచ్చ…

Operation Sindhoor controversy

నాడు కేంద్ర ప్రభుత్వానికి మూకుమ్మడి మద్దతు పలికిన విపక్ష పార్టీలన్నీ నేడు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మీద మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. అయితే అసలు విషయానికొస్తే, గత రెండు రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ మీద పార్లమెంట్ లో రచ్చ జరుగుతుంది.

పెహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సాగించిన పోరాటమే ఆపరేషన్ సింధూర్. అయితే నాడు యావత్ భారతం ఒక్కతాటి మీదకొచ్చి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, ప్రధాని మోడీ ఆదేశాలకు, భారత సైన్యం వీరత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు.

ADVERTISEMENT

అయితే నాడు మద్దతు పలికిన విపక్షాలు నేడు రచ్చ చెయ్యడానికి కారణాలు ఏంటని పరిశీలిస్తే, అందులో ముఖ్యంగా సీజ్ ఫెయిర్ అంశం ప్రధానంగా చర్చకొస్తుంది. పెహల్గామ్ మారణ హోమం వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల హస్తం ఉండడంతో భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా దాడులకు పాల్పడగా యావత్ భారతం భారత సైన్యాన్ని చూసి గర్వించారు.

అయితే అటు పాక్ కు భారత సైన్యం దాడికి ప్రతిస్పందించిన సంగతి తెలిసిందే. అయినా ఎక్కడా భారత సైన్యం వెనక్కి తగ్గొద్దు అంటూ రాజకీయ పార్టీల నుంచి సామాన్య ప్రజానీకం వరకు ఆపరేషన్ సింధూర్ కు బేషరతు మద్దతు పలికారు. చివరికి భారత్ – పాక్ మధ్య యుద్ధం తప్పదు అనేలా ఇరు దేశాల మధ్య యుద్ధం మేఘాలు కమ్ముకున్న వేళ సీజ్ ఫేర్ అంటూ వైట్ హౌస్ నుంచి విడుదలైన ఆ ఒక్క ప్రకటన నేటి భారత పార్లమెంట్ ను కుదిపేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫెయిర్ ఒప్పందం కుదిరింది, అందుకు నేనే పెదరాయుడు పాత్ర పోషించాను అంటూ వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఇప్పుడు అదే అంశం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రధాని మోడీ నుంచి వివరణ కోరుతుంది విపక్షం.

మన రెండు దేశాల వివాదానికి వైట్ హౌస్ మధ్యవర్తిత్వం ఎందుకు అవసరమయ్యింది.? ట్రంప్ ముందుగా ఎందుకు సీజ్ ఫెయిర్ గురించి ప్రకటించారు.? అమెరికా పెద్దన్న చేతిలో మోడీ కీలుబొమ్మగా మారారా.? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ నుంచి ప్రియాంక వరకు కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.

అటు బీజేపీ పెద్దలు కూడా విపక్ష నేతల ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేక దేశ భక్తి కాన్సెప్ట్ తో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రేడ్ డీల్ బెదిరింపులతో భారత్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి లొంగింది అంటూ ట్రంప్ ప్రకటన చేసినా బీజేపీ దానికి కౌంటర్ అటాక్ట్ చెయ్యలేక పోవడానికి కారణమేంటంటూ ప్రత్యర్థి పార్టీలు బీజేపీ ని నిలదీస్తున్నాయి.

ఇప్పుడు ఈ అంశం కూడా ఆపరేషన్ సింధూర్ రచ్చలో భాగమయ్యింది. దేశ రాజకీయాలను తన కనుసైగలతో శాసించగలిగిన బలమైన ప్రధాని వైట్ హౌస్ సైగలకు తలొగ్గరా.? అంటూ కాంగ్రెస్ మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతుంది. అయితే పాక్ – భారత్ వివాదలకు ప్రధాని ఎవరి మధ్యవర్తిత్వం కోరలేదనీ చెపుతున్న బీజేపీ ట్రంప్ వ్యాఖ్యలను మాత్రం బలంగా ఖండించలేకపోవడం విపక్షాలకు మరింతగా కలిసొస్తుంది.

ADVERTISEMENT
Latest Stories