ఒకప్పుడు ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ దేశానికే అన్నపూర్ణగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ గంజాయి సాగులో మొదటి స్థానానికి పోటీపడుతూ దేశంలోనే గుర్తింపు సాధించింది అంటూ కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో గంజాయిని ఉక్కుపాదం తో అణిచివేస్తాం అంటూ పవన్, నేను రాష్ట్రానికి కియా వంటి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తే జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి గంజాయి తీసుకొచ్చి యువతను మత్తుకు బానిసలు చేసి వారి భవిష్యత్తుని నిర్విర్వయం చేస్తున్నారంటు బాబు ఇలా వైసీపీ ప్రభుత్వంపై గంజాయి సెంట్రిక్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఈ గంజాయి సాగు హద్దులు దాటుతుందని, అక్కడ ఉన్న స్థానిక వైసీపీ ముఖ్య నేతల అండతోనే ఈ పంట పొలాల పొలిమేర్లలోకి, అక్కడి నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి ఎగుమతి అవుతుందంటూ స్థానిక టీడీపీ, జనసేన నేతలు పలు ఆధారాలు బయటపెట్టినప్పటికీ దీని పై స్పందించే నేతే లేరు. చర్యలు తీసుకునే అధికారులు లేరు.
ఒక్క ఛాన్స్ అవకాశంతో రాష్ట్రంలో గద్దెనెక్కిన వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా దేశంలో మరెక్కడా దొరకని ప్రత్యేక మద్యం బ్రాండ్లను ఏపీ కి అందించి ఎంతో మంది అమాయకుల చూవుకి కారణమయ్యింది. తండ్రి లేని బిడ్డ అంటూ వచ్చిన ఈ వైస్సార్ బిడ్డ అనేక కుటుంబాలలో తన మద్యం వ్యాపారంతో ఎంతోమంది పిలల్లకు తండ్రులను దూరం చేసాడు. ఈ పాపం ఎవరిదీ..? ఈ కుటుంబాలకు దిక్కెవరు అంటూ కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
అలాగే మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడిన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక్కరాజధాని నిర్మించలేదు కానీ గంజాయిలో మాత్రం ఏపీని దేశానికే రాజధాని చేసారంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ నేతల దగ్గర సమాధానం కరువయ్యింది. ఇలా ఒకపక్క గంజాయి, మరోపక్క మద్యం అంటూ టీడీపీ, జనసేనలు వైసీపీని రెండు వైపులా గట్టిగానే వాయిస్తున్నారు.




