హిందీ మార్కెట్లో మన బలాలు బలహీనతలు

Dasara Hindi Marketతెలుగు సినిమాలకు మార్కెట్ పెరిగింది. రాజమౌళి పుణ్యమాని మిలియన్ డాలర్ల వర్షం కురిసే ఓవర్సీస్ తో మొదలుకుని అయిదు వేల జనాభా ఉన్న చిన్న పల్లెటూరి సింగల్ స్క్రీన్ దాకా బిజినెస్ పరిధి హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు హిందీలో మన హీరోల ఇమేజ్ చాలా పరిమితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే దసరా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లు దాటేసినా నార్త్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో దూకుడు చూపించలేకపోయింది. కాంతారా తరహాలో మెల్లగా ఎక్కుతుందనుకుంటే ఆ సూచనలు పెద్దగా కనిపించడం లేదు.

నాని ఇది పుష్ప రేంజ్ లో రీచ్ అవుతుందని ఆశించాడు. అందుకే దేశంలో ఉన్న కీలక నగరాలన్నీ తిరిగి అక్కడి ఫుడ్ అడ్డాలకు వెళ్లి మరీ తన మొదటి ప్యాన్ ఇండియా మూవీని ప్రమోట్ చేసుకున్నాడు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో వసూళ్ల ప్రభంజనం బాలీవుడ్ థియేటర్లలో లేదు. మరీ దారుణంగా లేదు కానీ ఇప్పుడున్న స్పీడ్ అయితే తక్కువ. నేనేమైనా అమితాబ్ బచ్చన్ కాదుగా ఒకేసారి జనం ఎగబడి చూసేందుకని నాని ఓ లాజిక్ కరెక్ట్ గానే చెప్పాడు. కానీ ఇదే ముక్కు మొహం తెలియని నిఖిల్ కార్తికేయ 2తో హిట్టు కొట్టాడుగా.

ADVERTISEMENT

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. మనకంటూ బలాలు బలహీనతలు ఉన్నాయి. చిరంజీవి వెంకటేష్ నాగార్జున లాంటి సీనియర్లు ఎంత ప్రయత్నించినా అక్కడ మార్కెట్ కి ఏర్పరుచుకోలేక వెనక్కు వచ్చారు. ప్రభాస్ ఈ లెక్కలన్నీ మార్చేసి టి సిరీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు తన వెంటపడేలా చేసుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప అక్కడి బిసి సెంటర్లలో అరాచకం సృష్టించింది. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ ల సంగతి సరేసరి. ముగ్గురు ఖాన్లతో మొదలుపెట్టి కపూర్ల దాకా అందరూ మనసులో తెగ కుళ్ళుకున్నారు.

ఉత్తరాది ఆడియన్స్ కోరుకునే మాస్ స్టఫ్ మనకు బోలెడు ఉంది. దాన్ని సరైన రీతిలో ఎక్స్ పోజ్ చేయాలి. హిట్టో ఫ్లాపో తర్వాత మెల్లగా మన సినిమాలు డబ్బింగ్ రూపంలో వాళ్లకు అలవాటు చేస్తూ పోవాలి. ఒకటి పోగానే వెంటనే ప్రయత్నాలు ఆపకూడదు. అలా అయితేనే క్రమంగా అలవాటు పడతారు. రవితేజ, విశ్వక్ సేన్ లాంటి స్టార్లు నానిలాగా విస్తృతంగా తిరిగి మన భాష తెలియని చోట పబ్లిక్ కి సినిమా గురించి తెలిసేలా చేయాలి. అప్పుడే రీచ్ పెరుగుతుంది. శాటిలైట్ ఛానల్స్ లో కాదు థియేటర్లలో చూద్దామనే ఆసక్తి పెరుగుతుంది. అది హీరోల చేతుల్లోనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories