నా చావు వార్త… నాకు నవ్వొచ్చింది… – టాప్ డైరెక్టర్!

P-Vasu--Tamil-Directorసోషల్ మీడియాలో బ్రతికి ఉన్న సెలబ్రిటీలకు పాడే కట్టేయడం ఇటీవల కాలంలో పెచ్చుమీరుతున్న వైనం తెలిసిందే. ఎవరో ఒకరు లేపిన పుకారును సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అలా అలా వైరల్ అవుతూ…. చివరికి అది అసలైన వారికి చేరువై, వాళ్ళే సమాధానం ఇచ్చుకునేలా చేస్తోంది. గత కొంతకాలంగా పలువురు సినీ సెలబ్రిటీలు ఈ బారిన పడగా, తాజాగా “చంద్రముఖి” డైరెక్టర్ పి.వాసు కూడా ఇదే జాబితాకు ఎక్కారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో “చంద్రముఖి” వంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి.వాసు చనిపోయారంటూ చెలరేగిన పుకారుపై సదరు డైరెక్టర్ సోషల్ మీడియాలోనే వీడియో పోస్ట్ చేస్తూ వివరణ ఇచ్చుకున్నారు. “ఉదయం ఆరు కిలోమీటర్లు వాకింగ్ కు వెళ్లివచ్చే సరికి నేను చనిపోయానన్న వాట్సప్ సందేశాలు చూసి నాకు నవ్వోచ్చిందని” తెలిపిన వాసు, తనపై అభిమానాన్ని కురిపించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories