సీఎం తల నరుకుతా అని ప్రగల్బాలు, టీడీపీ కండువా వేసుకోడానికి సిద్ధం!

Paderu MLA Giddi Eswari Joining TDPఒకప్పుడు సీఎం తల నరుకుతా అని బహిరంగంగా ప్రకటించి ఆ తరువాత ఎస్టీ కార్డుతో తప్పించుకున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మొత్తానికి వైకాపా కాడి వదిలేసి టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. ఆమె సోమవారం ఉదయం 10 గంటలకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు.

ADVERTISEMENT

గత ఎన్నికల్లో ఈశ్వరి పాడేరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరూ సాధించనంత మెజార్టీ సాధించారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేశారు. అయితే ఇటీవలే ఆమె ప్రత్యర్థిని పార్టీలోకి తెచ్చి అరకు సీట్ ఇస్తా అని జగన్ మాట ఇచ్చారు. ఈ విషయంలో తనను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఈశ్వరి పార్టీ మారాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే 22మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, గిడ్డి ఈశ్వరితో కలిపి ఆ సంఖ్య 23కు చేరుకుంటుంది. మరోవైపు ఇంకో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే వారు కూడా సైకిల్ ఎక్కనున్నారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories