ట్రైలర్ టాక్ – చూసిందే… అయినా బాగుంది..!

Controversial Film Padmavati Overseas Release Before Indiaఅనేక వివాదాలు, సుప్రీంకోర్టు తీర్పు నడుమ ఈ నెల 25వ తేదీన దీపికా పదుకునే “పద్మావత్” పేరుతో విడుదల కావడానికి అన్ని హంగులు పూర్తి చేసుకుంది. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. హిందీలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన అదే ట్రైలర్ ను తెలుగులో డబ్ చేసి విడుదల చేసారు తప్ప, ఏం మార్పులు చేయలేదు.

ADVERTISEMENT

డబ్బింగ్ బాగానే కుదరడంతో చూడడానికి ఎలాంటి ఇబ్బంది గానీ, హాస్పాస్పదంగా గాని అనిపించదు. సంజయ్ లీలా భన్సాలి టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు తోడు దీపికా పదుకునే స్వరూపం, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ల పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో సంజయ్ లీలా భన్సాలి రూపొందించిన ‘భాజీరావు మస్తానీ’ సినిమా ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తుండడం మైనస్ అయినా, ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం, ఈ సినిమా ఓపెనింగ్స్ కు లాభిస్తుందని చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories